పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు ₹3 పెంపు తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారింది. రాష్ట్రంలో అధిక వ్యాట్ ఉండటంతో ప్రతి నెల అదనంగా సుమారు ₹45 కోట్లు, ఏడాదికి దాదాపు ₹540 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనున్నట్లు అంచనా.
తెలంగాణలో పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ అమల్లో ఉంది. తాజా ధరల పెంపుతో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు అత్యధికంగా నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర ₹110.78 కాగా, డీజిల్ ధర ₹98.90కు చేరింది. పెట్రోల్‌పై ₹3.39, డీజిల్‌పై ₹3.26 పెరిగాయి.
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ₹97.77, ముంబైలో ₹106.68, కోల్‌కతాలో ₹108.74, చెన్నైలో ₹103.67గా ఉన్నాయి.














