తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలవుతోందని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తొలి దశలో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేయగా, దాదాపు 2 లక్షల 90 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇప్పటికే 50 వేల ఇళ్లు పూర్తై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా నిర్వహించుకున్నారని వెల్లడించారు. మరో రెండు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా, రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. పేదలకు 100 శాతం సబ్సిడీతో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 2BHK కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.