తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో జీ. నాగేశ్వర్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, ధాన్యం సేకరణ విధానం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కల్లాల వద్ద ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. రైతులకు వేగంగా సేవలు అందించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.