నల్లగొండ: ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి తొమ్మిది మంది గాయపడిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో జరిగింది. వెలిమినేడు గ్రామ శివారులో నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్‌లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో ఏప్రిల్ 9న కూడా ఈ కర్మాగారంలోనే పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే.