నవతెలంగాణ – తిరుపతి: చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం రహమత్‌నగర్‌లో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వేట కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపారు. దీంతో అక్కడిక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. […]

The post చిత్తూరులో జర్నలిస్టు దారుణ హత్య appeared first on Navatelangana.