అమరావతి: ఎపిలో డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు పై పేర్ని నాని మండిపడ్డారు.ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు స్పహ లేకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని, దేశంలో తనకంటే అనుభవమున్న సిఎం లేడని కోతలు కోస్తుంటారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరత వ్యాపారస్తులకు పండుగలా మారిందని ధ్వజమెత్తారు. పలుకుబడి ఉపయోగించి సమస్యను పరిష్కరించలేరా? అని తమ అనుభవం ఎందుకు? అని ప్రశ్నించారు. పెట్రోల్ అగచాట్ల మాటున పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు నలిగిపోతున్నాయని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.