మే 12న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ రాష్ట్ర 4వ ప్లీనరీ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే విడుదల కాగా శనివారం ప్రొఫెసర్ కోదండరాంను అధ్యక్షులుగా బలపరుస్తూ పార్టీ నాయకులు 3 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పార్టీ సీనియర్ నేతలు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ప్రధాన ఎన్నికల అధికారిగా, మహమ్మద్ అఫ్జల్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 12న జరిగే ప్లీనరీలో నూతన అధ్యక్షుని ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్,

బైరి రమేష్, నిజ్జన రమేష్, ఆశప్ప, పల్లె వినయ్ కుమార్, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్, కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, ఎస్‌సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరసయ్య, రంగారెడ్డి జిలా ్ల అధ్యక్షులు ధారసత్యం, యూత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వీరన్న, యూత్ రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి, పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ హనుమంత రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్, పార్టీ నాయకులు సర్దార్ వినోద్ కుమార్, రసూల్, జహీరుద్దీన్, బాలరాజు తదితరులు హాజరయ్యారు.