
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ/కాచిగూడ : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణ య్య విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, దేశంలోని ఓబీసీ సంక్షేమాభివృద్ధి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొ న్నారు. శుక్రవారం కాచిగూడలోని మహారాజ హోటల్ లో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేశ్, మోదీ రాందేవ్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన 13 బీసీ సంఘాల సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీ జేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొ న్నారు. జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం హక్కులు, రిజర్వే షన్లు కల్పించే మార్గం సులభమ వుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనేక కీలక పదవులు ఇచ్చిందని, బీసీ వర్గానికి చెందిన నాయకులను ప్రధాని, ఉ పరాష్ట్రపతి, గవర్నర్లు, మంత్రు లుగా అవకాశం కల్పించిందని అన్నారు. అలా గే బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు, పార్లమెంట్లో బీసీ బిల్లు, ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్లు, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసు కెళ్తామని స్పష్టం చేశారు.
రెండో విడత జనగణన ఓబీసీల కులగణన జరుగు తుందని పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని, కేంద్ర మంత్రివర్గం అనంతరం రైల్వే మం త్రి అశ్విని వైష్ణవ్ ఇదే అంశాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ దీన్ని రాజకీయం చేసి కేంద్రంపై బురుద జల్లే యత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ తెలంగాణలో పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేయను న్నారని తెలిపారు. ఈ నెల 10న సికిం ద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహి రంగ సభకు రాష్ట్రం లోని ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తె లంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రా నుందని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తా మని ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్రమోదీ మూడుసార్లు ప్రధాని అయ్యారని, ఉప రాష్ట్రపతి, 26 మంది కేంద్ర మంత్రులు, నలుగురు గవర్నర్లు, బడుగుల బీసీలు ముఖ్యమం త్రులు అయ్యారని పేర్కొన్నారు. ఓబీసీ కుల గణన, పార్లమెంట్ బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేష న్లు, ఉప ప్రణాళిక అమలునకు కేంద్రం చర్య లు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాజేందర్, నిఖిల్ పటేల్, ఆశోక్, మల్లేశ్ యాదవ్, రాము, భీమ్ రాజు, అంజిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.















