న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే యుద్ధం పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అక్కడ మిగిలిన క్షిపణి సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకోవాలని కోరుకుంటున్నామని, ఇరాన్ నేతలు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. కాగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు ఇరాన్ 14 అంశాలతో ప్రతిపాదన పంపింది.

The post దురుసుగా ప్రవర్తిస్తే ఇరాన్‌పై మళ్లీ దాడులు: ట్రంప్ హెచ్చరిక appeared first on Navatelangana.