ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని, తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారం టూ టాలీవుడ్ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లా రు. మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నాగార్జున టీ షర్టులు మీరెలా అమ్ము తారు? అంటూ వ్యాపారిని ప్రశ్నించింది. ఫొటోలను వాణిజ్య పరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటూ నిలదీసింది. వ్యా పారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ ’ది ఘోస్ట్’ సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని, కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్‌తో తమకు ఒప్పందం ఉందని,

నాగా ర్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని స్పష్టం చేశారు. దీనిపై నాగార్జున తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఒప్పంద పత్రాలు అడిగి నప్పటికీ సమర్పించలేదని, కోర్టుకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలు సైతం అసంపూర్ణంగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరికి, ఈ వ్యవహా రంలో తమకు నాగార్జునతో కానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో కానీ ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని న్యాయస్థానం ముందు వ్యాపారి అంగీకారం తెలిపారు. ఇరుపక్షాల వాదనలపై ధర్మా సనం తీవ్రంగా స్పందించింది. నాగార్జున, ప్రొడక్షన్ హౌస్‌తో ప్రత్యక్ష ఒప్పందం లేదని మీరే అంగీకరిస్తున్నప్పుడు టీ షర్టులను విక్రయించే చట్టబద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆగ్రహం కనబర్చింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.