
ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అజేయంగా 87 పరుగులతో చెలరేగగా.. కార్తిక్ శర్మ(41 నాటౌట్) రాణించాడు. దీంతో చెన్నై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలుపొందింది.














