
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మ కాలపై నిషేధం మొదలైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా అ మ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాక్ ఉన్నా.. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. యూరియా అ మ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లే దా..? అని నిలదీశారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి,
ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమని అన్నారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వె చ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదం అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవై పు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుం డటం వారిని అవమానించడమే అని పేర్కొన్నారు. రైతు బంధు ఇవ్వడంలో , బోనస్ చెల్లించడంలో, పంట బీమా పథకం అమలులో,రుణమాఫీ చేయ డంలో, యూరియా సరఫరాలో, పంట కొనుగోళ్లు చేయడంలో , కొన్న పంట కు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని, ఈ వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసు రు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదని అన్నారు.













