
చెన్నై: ఐపిఎల్ 19 సీజన్ తుది దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని జట్లు భారీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. దీంతో మ్యాచ్లు రసవత్తరంగా మారాయి. దాంతో లీగ్ వీక్షకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ జాబితాలో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు పూర్తయిన 43 మ్యాచ్ల్లోని డేటా ఆధారంగా, చెన్నై సూపర్ కింగ్స్ సగటున 308 మిలియన్ల వీక్షకులతో అగ్రస్థానంలో నిలిచింది.















