నవతెలంగాణ-మిరుదొడ్డి: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు జెండా ఎగరవేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, “దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. 8 గంటల పనిదినం కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజును స్మరించుకుంటున్నాం” అని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని […]

The post ధర్మారంలో ఘనంగా మే డే ఉత్సవాలు appeared first on Navatelangana.