కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తున్నట్లు బుధవారం హైకోర్టు వెల్లడించింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది.

కాగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ కెసిఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్‌ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి కోర్టు.. అలాంటి తీర్పే ఇచ్చింది.