తమిళనాడు: ఒకప్పుడు దేశంలో కీలక స్థానంలో ఉన్న చెన్నై..ఇప్పుడు తన స్థానం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెన్నై అభివృద్ధి గణనీయంగా మందగించిందిని అన్నారు. తమిళనాడులో రెండవ రోజు చంద్రబాబు పర్యటించారు. ఎన్ డిఎ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. చెన్నై ఎయిర్ పోర్టు పరిస్థితి సంతృప్తికరంగా లేదని, అభివృద్ధి ఆగిందని తెలియజేశారు. బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందాయని, ఇటీ, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో ముందున్నాయని, కానీ చెన్నై వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏం నష్టమో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలపాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో 50శాతం పెంపు ఉత్తమ ఆప్షన్ అని దక్షిణాదికి జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా? అని సిఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీ అభివృద్ధిలో తమిళనాడు వెనుకబడిందని, అంతర్జాతీయ కంపెనీలకు తమిళులు సిఇవొలుగా ఉన్నా, దాని ఫలితం తమిళనాడులో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉందని, మోడీ ఎవరికి సరెండర్ కారని, మోడీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.