నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కూడిన బీఆర్‌ఎస్ త్రిసభ్య కమిటీ సోమవారం ఢిల్లీ వెళ్లింది. బుధవారం కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఆ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీనియర్ అడ్వకేట్లతో చర్చించాలని భావించింది. అందుకోసమే త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ వెళ్లినట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.
The post ఢిల్లీలో బీఆర్‌ఎస్ త్రిసభ్య కమిటీ appeared first on Navatelangana.

