
నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.



