
గాంధీనగర్: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి అతడిని కాలువలో పడిసింది. భర్త కాలువలో ఈదుతూ నిర్మాణాన్ని పట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చానీ ప్రాంతంలో గిరీష్ పటేల్, పాల్గుణీ పటేల్ అనే దంపతులు నివసిస్తున్నారు. గిరష్ పార్లర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఖేడాకు చెందిన సెలూన్ యజమాని కౌశిక్ శర్మతో పల్గూణి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రణాళిక వేశారు.
కౌశిక్ తన స్నేహితుడు నికుల్ గోస్వామితో హత్య చేసి ఒప్పందం చేసుకున్నాడు. తొలుత ముప్పై ఐదు వేల రూపాయలు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చారు. ఏప్రిల్ 15న రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గిరీష్ ను కిడ్నాప్ చేశాడు. కత్తితో బెదిరించి వివిధ ప్రాంతాలలో తిప్పి సోజిత్ర శివారులోని ఓ కాలువలో అతడిని పడేశారు. గిరీష్ చనిపోయాడని భావించి అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారు. కాలువలో కొట్టుకొని పోతూ ఒక నిర్మాణాన్ని గట్టిగా పట్టుకొని బయటకు వచ్చాడు. మూడు గంటల పాటు మృత్యువుతో పోరాటం చేసి కాలువ నుంచి బయటకు వచ్చాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో గిరీష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య, ప్రియుడితో పాటు ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు.














