
ఎపిలోని పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. జిల్లా యడ్లపాడు మండలం జగ్గపురంలో సోమవారం ఉదయం స్థానిక చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతులను అమనుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తిం చారు. చెరువు గట్టుపై బాలుర చెప్పులు ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరు కున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. బాలురు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి
లోతు ఎక్కు వగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పో వడం తో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరు మున్నీర య్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.












