సచివాలయంలో శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026లో తమ స్టాల్ ఆవిష్కరణకు ఆహ్వానించిన ఎక్స్‌కా మెషీన్స్ వ్యవస్థాపకులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి , కౌండిన్య అచ్యుతుని 

ఎక్స్‌కా మెషీన్స్ స్టాల్, యంత్రాల ఆవిష్కరణకు మంత్రి తుమ్మలకు ఆహ్వానం దేశీయ అవసరాలకు అనువైన మినీ తవ్వకం యంత్రాలు వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ, మున్సిపల్ రంగాలకు ఉపయుక్తం ఎక్స్‌కా మెషీన్స్ వ్యవస్థాపకుల వెల్లడి


మన తెలంగాణ/హైదరాబాద్ : ఎర్త్‌కాన్ ఎక్స్‌పో -2026లో ఎక్స్‌కా మెషీన్స్ ఏర్పాటు చేయనున్న స్టాల్, యంత్రాల అధికారిక ఆవిష్కరణ కా ర్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆ సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి, కౌండిన్య అచ్యుతుని ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో వారు మం త్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ ఎక్స్‌పో జూన్ 19,20,21 తేదీలలో హైదరాబాద్‌లో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు.ప్రపంచ స్థా యి సమాచార సాంకేతిక, భారీ యంత్రాల రంగ అనుభవంతో తిరిగి వచ్చిన తెలుగు యువ పారిశ్రామికవేత్తలు ఈ సంస్థను నెలకొల్పారు.

భా రతీయ అవసరాలకు అనుగుణంగా తవ్వే మినీ యంత్రాలు, స్కిడ్ స్టీర్ లో డర్ల తయారీపై తమ ఎక్స్‌కా మెషీన్స్ దృష్టి సారించినట్టు ఈ సంస్థ వ్యవస్థాపకులు ఈ సందర్భంగా వివరించారు. తమ సంస్థ తయారు చేసిన యంత్రాలు వ్యవసాయం, మున్సిపల్ పనులు, మైనింగ్ వంటి చిన్న స్థా యి నిర్మాణ రంగాలకు అనువైనవని వారు తెలిపారు. ఆధునిక సాంకేతి క పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యంత్రాలు మార్కెట్‌లో అందుబా టు ధరలకు అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఎక్స్‌కా మెషీన్స్ వ్యవస్థాపకులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి , కౌండిన్య అచ్యుతుని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై తమ నూతన ప్రస్థానానికి ఆశీస్సులు, ప్రోత్సాహాన్ని అందించాల్సిందిగా వారు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు విజ్ఞప్తి చేశారు.