
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 19లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. 12 మ్యాచుల్లో 8 విజయాలను అందుకుని ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు సొం తం చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో నెగ్గి ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. విధ్వంసక బ్యాటర్లతో కూడిన సన్‌రైజర్స్‌ను కిందటి మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని సాధించిన విజయం జట్టు ఆత్మవిశ్వాసా న్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందే హం లేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును ముం దుండి నడిపిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా అసాధారణ కెప్టెన్సీతో టీమ్‌కు అండగా నిలుస్తున్నాడు. జట్టు విజయాల్లో గిల్‌దే ప్రధాన పాత్ర అని చెప్పక తప్పదు. సహచరుడు సాయి సుదర్శన్‌తో కలిసి పలు మ్యాచుల్లో జట్టుకు శుభారం భం అందించాడు.
ఇక సాయి కూడా అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటున్నా డు. ఇప్పటికే సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. జోస్ బట్లర్, నిషాంత్ సంధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటి యా తదితరులు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటర్లకు తోడు బౌలర్లు కూడా తమవంతు సహకారం అందిస్తుండడం జట్టుకు సా నుకూలంగా మారింది. సిరాజ్, రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, హోల్డర్ తదితరులు అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తున్నారు. ఇలా రెండు విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న గుజరాత్ వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో గెలిచినా గుజరాత్‌కు ప్లేఆఫ్ బెర్త్ సొంతమవుతోంది. జట్టు దూకుడును చూస్తే చివరి రెండు పోటీల్లో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.














