
బెంగళూరు: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం వేకువజామున దిలీప్ రాజ్ కు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయన మృతితో కన్నడ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. మిలానా చిత్రంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. యూ టర్న్ సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా సినిమాలు తీస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. డిఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై బుల్లితెర సీరియళ్లను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు.













