
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై పెను ప్రభావం పడుతోందన్నారు. అంతిమంగా సామాన్యుడిపై పెను భారం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర పెంపు సామాన్యులను మోసగించడమే అని ఆరోపించారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు.











