వాషింగ్టన్ :హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రణాళికను తెరపైకి తీసుకు వచ్చారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్లాను ప్రకారం ఇరాన్ పోర్టుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తూ మిత్రదేశాల మద్దతుతో ఇతర దేశాలకు స్వేచ్ఛగా ఇరాన్ నుంచి ఇంధనం రవాణాకాకుండా అడ్డుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హర్మూజ్ జలసంధిని తెరవడానికి అనేక దౌత్యపరమైన, విధానపరమైన మార్గాలను ట్రంప్ ఇరాన్ ముందుంచారని చెప్పారు.