తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.

జనరల్, వొకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. ఫీజు చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు జరగనున్నాయి.