
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు రైల్వే ట్రాక్ సమీపంలో ఎగిసిపడటంతో సికింద్రాబాద్ నుండి భద్రాచలంలో వెళ్లే కాకతీయ ఎక్స్ప్రెస్ను సుమారు 30 నిమిషాల పాటు నిలిపివేశారు. స్థానికుల సహాయంతో రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను లోకో పైలట్ గుర్తించి రైలును ఆపి వేయడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పొలానికి ఎవరు మంటలు అంటించారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.












