హైదరాబాద్: జూబ్లీహిల్స్ సెక్స్ ట్రాప్ కేసులో మరో పోక్సో కేసు నమోదైంది.  ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్(22)పై మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది.  తనని లైంగికంగా వాడుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్  చేయడంతో బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర డబ్బులు గుంజాడని ఫిర్యాదులో పేర్కొంది.  జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసులో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.  ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదయ్యాయి.