
హైదరాబాద్: పని మనిషి యజమానురాలును హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్రే సతీమణి సునంద(55) నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం సునందను పని మనిషి కల్పన గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్పనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.















