
ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేసి ఆర్డర్లపై దుకాణాలకు సప్లై చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం కేజి బంగారు నగలను దుకాణాల్లో ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేసి బంగారు నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉండే సిసి కెమెరాలను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.













