తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో యుడిఎఫ్ హవా కొనసాగుతోంది. యుడిఎఫ్ విజయ దుదుంభి మోగిస్తోంది. యుడిఎఫ్ పార్టీ 21 స్థానాలలో విజయం సాధించగా 76 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. ఎల్‌డిఎఫ్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాలలో గెలవడంతో పాటు 32 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌డిఎ రెండు స్థానాలలో లీడ్ ఉన్నారు.