
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు ప్యాట్ కమ్మిన్స్. తన కెప్టెన్సీలో ఎస్ఆర్‌హెచ్ 2024 ఫైనల్స్‌కి కూడా చేరింది. అయితే గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ప్యాట్ కమ్మిన్స్ ఆడలేదు. అతడి స్థానంతో ఇషాన్ కిషన్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఇషాన్ కెప్టెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఏడు మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడినప్పటికీ.. హోం గ్రౌండ్‌లో వరుసగా జరిగిన మూడు మ్యాచుల్లో జట్టును గెలిపించి తన కెప్టెన్సీ సత్తాను చాటి చెప్పాడు.
ఇప్పుడు కమ్మిన్స్ గాయం నుంచి కోలుకొని.. తిరిగి జట్టుతో జత కట్టాడు. అయితే కమ్మిన్స్ వచ్చినా.. ఇషాన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీం ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇషాన్‌నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. టీం ఇండియ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా ఇషాన్‌కే ఓటు వేశాడు. కమ్మిన్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ను 2024 ఫైనల్స్ వరకూ తీసుకుపోయిన మాట వాస్తవమే కానీ.. ఈ సీజన్‌లో ఇషాన్‌తో ఆటగాళ్లకి మంచి సమన్వయం కుదిరిందని భజ్జీ అన్నాడు. అందుకే కమ్మిన్స్‌కి కెప్టెన్సీ వద్దని ఇషాన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.












