హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత వల్లే మాజీ సిఎం కెసిఆర్ మేల్కొంటున్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కవితకు థ్యాంక్స్ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని, కవిత భయంతోనే కెసిఆర్ బయటకు వస్తున్నారని, వాటాల పంపకాల వల్లే కవిత పార్టీ పెట్టిందని తెలియజేశారు. కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తే కెసిఆర్ కు ఇబ్బందేంటీ? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. నగరం చుట్టూ చెరువులను బిఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని, బిఆర్ఎస్ నేతలు ఎందుకు సభలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. డిక్లరేషన్లు అమలు చేస్తున్నామని త్వరలోనే పదవులు భర్తీ చేస్తున్నామని, కేబినెట్ విస్తరణపై సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.