బావిలో పడి తండ్రీకుమారులు మృతి

తండ్రి కొడుకుల మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క ...

మన తెలంగాణ /ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం కర్లపల్లి గ్రామంలో బావిలో పడిన లేగదూడను బయటకు తీసి అనంతరం తండ్రీ కొడుకులు బావిలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం 35 ఫీట్ల లోతులో ఉన్న బావిలో ఆవులేగ దూడ దూకడంతో గమనించిన తండ్రి రసపుత్ రాజు అతని కుమారుడు పవన్ లేగ దూడను తీసే ప్రయత్నంలో ఇద్దరు బావిలోకి దిగారు. లేగదూడను బయటకు తీసిన తరువాత వాళ్లు ఒకే తాడును పట్టుకొని బయటకు రావడానికి ప్రయత్నించారు. తాడు తెగిపోవడంతో ఇద్దరు బావిలో పడ్డారు. తీవ్రంగా గాయపడడంతో ఇద్దరు బావిలోనే మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి తండ్రి రసపుత్ రాజు, పవన్ మృతదేహాలను బయటికి తీశారు.

దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క...

బావిలో పడి తండ్రి కొడుకుల మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బావిలో పడి తండ్రి రస్పూర్ రాజు కుమారుడు పవన్ మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటన వివరాలను తెలుసుకోవడానికి మంత్రి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాద పరిస్థితులపై సమాచారం సేకరించారు. ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరపాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు.ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.