
హైదరాబాద్: మాజీ డిజిపి విజయ్ రంజన్ రే భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. నేపాలి గ్యాంగ్ ఈ హత్య చేసి ఉంటుందని ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని, కొన్ని క్లూస్ లభించాయి ఆ క్లూస్ ఆధారంగా వర్కౌట్ చేస్తున్నామని, నేపాలి పని వాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారని, రాత్రి మాజీ డిజిపి ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ హత్య చేసిందన్నారు. ఘటన సమయంలో పిల్లలు ఇద్దరు పైనే ఉన్నారని, తనుజ గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రిస్తున్నారని, ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డారని వివరించారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటామని, ప్రజలు ఆందోళన చెందవద్దని, నేపాలి మనుషులు ఇంట్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలన్నారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసిందని వివరించారు. మాజీ డిజిపి తల్లి కోసం ఆమె హైదరాబాద్ కు వచ్చారని, ఇటీవల మాజీ డిజిపి తల్లి మరణించారని, అప్పటి నుండి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటుందన్నారు. ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామని, నిందితులు బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారని, అనంతరం వెనక నుండి పారిపోయారన్నారు.














