
చైన్నై: సేలం జిల్లా ఈడప్పాడి నియోజకవర్గం నుంచి ఎఐఎడిఎంకె చీఫ్ పళనిస్వామి సమీప అభ్యర్థిపై 98,110 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. పళనిస్వామి మొత్తం 1,48, 933 ఓట్లు సాధించుకుని ప్రత్యర్థి , ఇండిపెండెంట్ ప్రేమకుమార్ కెను ఓడించారు. ఈ నియోజకవర్గంలో 1989 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా ఆరోసారి పళనిస్వామి విజయం సాధించడం విశేషం. 44011 ఓట్లు తెచ్చుకున్న డిఎంకె అభ్యర్థి కాశీ కేను కూడా పళనిస్వామి ఓడించారు.












