
మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువతి పట్ల ఓ వ్యక్తి వేధించిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్, నానక్‌రాంగూడ సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేసేందుకు యువతి వచ్చింది. రన్నింగ్ చేస్తూండగా ఓ యువకుడు బాధితురాలిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అప్రమత్తమైన యువతి నిందితుడిని వీడియో తీయబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షిత మనుకున్నా... కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’ అంటూ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్‌కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది.
గుర్తుతెలియని వ్యక్తి యువతి పట్ల ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్ మహిళలకు సురక్షితంగా ఉండకూడదా? సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్‌కు రాలేదని తెలిపారు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే రన్నింగ్‌కు వస్తా అని రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె చెప్పింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్‌పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.











