ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని గురువారం విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ధనుష్‌కి మంచి మార్కెట్ ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా బలమైన కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోంది. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. మంచి కంటెంట్‌తో ‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. విఘ్నేశ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘కర’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ధనుష్ ఉన్నారు. జీవీ ప్రకాష్ సంగీతం బాగుంటుంది. ఇంకా కొన్ని పాటలు డైరెక్ట్‌గా తెరపైనే చూడాలి. అన్ని పాటలు స్క్రీన్‌పై అద్భుతంగా ఉంటాయి. సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు.