
డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఒక మంచి క్యామియో రోల్ చేశా.
నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్‌తో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. -మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో శ్రీ విష్ణు క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలిపి ఈ సినిమాను హిలేరియస్‌గా తెరకెక్కించారు. ఆయన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ రెండూ అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం నేను నటించిన‘భగవంతుడు’ రాబోతోంది. అలాగే ‘సిగ్మా’ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. సత్యదేవ్‌తో ఒక సినిమా చేస్తున్నాను”అని అన్నారు.














