రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో లిఫ్ట్ వైర్ తెగింది. సంఘటన సమయంలో మంత్రి లిఫ్ట్ లో ఉన్నాడు. ఈ ఘటన కరీంనగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అతని సహచరులు, సెక్యూరిటి సిబ్బంది లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మధ్యలోనే ఒక్కసారిగా ఆగిపోయింది. ఆతర్వాత లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ఘటనలో మంత్రి కి స్వల్ప గాయలైనాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది వెంటనే లిఫ్ట్ తలుపులు తెరిచి మంత్రిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.