
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ మేడే కాను కగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమే అని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో శు క్రవారం కెటిఆర్ బిఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. కార్మికులతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం భారీగా 1000 రూపాయలు పెంచారని అ న్నారు. హోటల్లో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధి పైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 3,315 రూ పాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రె స్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుందని, దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌ను కూడా మోదీ వదిలిపెట్టలేదని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధ రతో రోజువారీ టిఫిన్లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ, ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. చమురు ధరలు పెంచి, గ్యా స్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బిజెపి ప్రభుత్వం సెస్ పేరుతో 65 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110 నుంచి రూ.120కి పెంచిందని చెప్పారు. కార్మికుల సం క్షేమం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సిగాచీ పరిశ్రమలో కార్మికులు ప్ర మాదంలో చనిపోతే వారికి ఇప్పటి వరకు పరిహా రం అందలేదని అన్నారు. చివరికి నగరానికి బతకడానికి వచ్చిన కూలీలు, కార్మికుల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎన్‌టిఆర్, చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కెసిఆర్ వంటి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ రేవంత్ రెడ్డి లాంటి సిఎంను చూడలేదని అన్నారు.
రాహుల్ గాంధీ అడుగు పెడితే ఉన్న ఆటోలు అమ్ముకున్నాడు
తాను కొన్ని నెలల క్రితం పార్టీ కార్యాల యం వద్ద కారు అందుబాటులో లేకపోవడంతో మష్రత్ అలీ అనే వ్యక్తి ఆటోను ఎక్కానని కెటిఆర్ తెలిపారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పి న విషయాల విని ఆందోళన చెందానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే మష్రత్ అలీ ఆటోను కాంగ్రెస్ అగ్రనేత రా హుల్ గాంధీ ఎక్కారని, ఆ సమయంలో అతనికి రెండు ఆటో లు ఉండేవని చెప్పారని పేర్కొన్నారు. రాహుల్ ఎక్కిన తర్వాత ఆయన తన ఆటోలను అమ్మేసుకు ని కిరాయి ఆటో నడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కొందరి అడుగు అలా ఉంటుందని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శించారు.
కార్మికులారా.. రెండేళ్లు భరించండి.. కెసిఆర్ వస్తారు
కొవిడ్ సమయంలో కార్మికులను కడుపులో పెట్టుకొని చూశామని కెటిఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం కెసిఆర్ ఉచితంగా రైళ్లలో పంపించారని చెప్పారు. కొవిడ్ సమయంలో అందరూ ఇళ్ల లో ఉంటే.. తాము రోడ్లు, వంతెనలు పూ ర్తి చేశామన్నారు. కార్మికులారా...రెండేళ్లు భరించండి.. కెసిఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని అన్నారు.













