
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ (భవానీ పూర్), తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ( కొళత్తూరు), కేరళ సిఎం పినరయి విజయన్ (ధర్మదం) వెనుకంజలో కొనసాగుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె మూడో స్థానానికి పడిపోయింది. సిఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ వెనకంజలో కొనసాగుతున్నారు. ఆ పార్టీ ప్రస్తుతం 40 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది.
పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (109), బిజెపి (177), కాంగ్రెస్(02), వామపక్షాలు(3), ఇతరులు(2) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(106), డిఎంకె కూటమి (55), అన్నాడిఎంకె కూటమి(73), ఇతరులు(0), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (42), యుడిఎఫ్(96), ఎన్డిఎ (02) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(97), కాంగ్రెస్ కూటమి(26), ఇతరులు (02), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(14), కాంగ్రెస్ కూటమి(06), ఇతరులు(03) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.











