
చెన్నై: తాను మన అందరివాణ్ణి అని తాను మన ఇంట్లో కుటుంబసభ్యుడునని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని, అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని హామి ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలియజేశారు. తనను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఏది సాధ్యమో అది మాత్రం చేస్తానని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తానని విజయ్ పేర్కొన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందని, తన ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని, టివికె కార్యకర్తలు లేకుంటే తాను లేనని అన్నారు. ఇది అస్థిర ప్రభుత్వం కాదని, తనకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు అని రాజకీయాల్లోకి వస్తే తాము చూసుకుంటామని ప్రజలంతా ప్రేమగా పిలిచారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మహిళలను కాపాడటం తమ ప్రభుత్వం లక్ష్యమని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, తాను దేవదూతను కాదని అన్నారు. అది చేస్తాం..ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పనని, ప్రజా ధనాన్ని వృధా చేయనని, దోచుకోనని, ప్రభుత్వంలో వేరే పవర్ సెంటర్లు ఉండవని తానే పవర్ సెంటర్ అని అన్నారు. ఇది తమ ప్రభుత్వం డ్రగ్స్ పై పోరాటం ఈ రోజు నుంచే ప్రారంభం అని దిస్ ఈజ్ న్యూ బిగినింగ్ అని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని విమర్శించారు. టివికె నేతలు ఎవరూ అహంకార ధోరణితో వెళ్లొద్దని, టివికెలో ఒకే అధికార కేంద్రం ఉందని అది విజయ్ మాత్రమేనని అన్నారు. మైనారిటీ ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్ కు అండగా ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మిత్రులైనా, శత్రువులైనా అందరికీ ఒకే చట్టమని విజయ్ స్పష్టం చేశారు. అన్నీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సమయం ఇవ్వండి అని కోరారు.














