
మన తెలంగాణ/హైదరాబాద్: నీట్- యూజీ-20 26 రద్దు, మోడీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ప్రధాని మోడీ హయాంలో 93పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు కోట్ల మం ది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సిఎం రేవంత్‌రెడ్డి ప్ర త్యేక హామీ ఇచ్చారు. నీట్ రద్దు నేపథ్యంలో విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభు త్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన హమీనిచ్చారు.
పేపర్ లీక్ జరిగితే సంబంధిత
మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిఎం విమర్శించారు. నీట్ రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణ యం దేశ యువత భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీ కులు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది తల్లిదండ్రులు నగలు అమ్మి తమ పిల్లలను నీట్ ఎగ్జామ్ రాయించారని వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
2019 నుంచి 15 రాష్ట్రాల్లో
ప్రధాన నియామక పరీక్షల పేపర్ల లీక్
2019 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక ప రీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని ఆయన గుర్తు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలే ఈ లీకులకు ప్రధాన కేంద్రాలుగా మారాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2014 మే నెలలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమయ్యాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ విడుదల చేసిన ‘ది పేపర్ లీక్ డెకేడ్‘ శ్వేతపత్రం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. వీటివల్ల సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని ఆయన చెప్పారు. 2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని ఆయన తెలిపారు.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ పరీక్షల లీకులు
నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యుజిసి-నెట్ (9 లక్షలు), సిఎస్ఐఆర్-నెట్, నీట్-పిజి రద్దు అయినట్టు సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దైందని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో 14 ప్రధాన లీకులు జరిగాయని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ’పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (తప్పుడు మార్గాల నివారణ) చట్టం’ను ఆమోదించినప్పటికీ, పెద్ద కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత, 2024 జూన్ వరకు దాని నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసిందన్నారు.












