నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లో పేప‌ర్ లీకేజీ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఈనెల 3న నిర్వ‌హించిన‌ నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ విద్యార్థి సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. ఢిల్లీలోని శాస్త్రీ భ‌వ‌న్ ఎదుట NSUI విద్యార్థి సంఘం నాయ‌కులు ధ‌ర్నా చేప‌ట్టారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని మండిప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను బారికేడ్ల‌ల‌తో అడ్డ‌గించారు. అదే విధంగా నీట్ పరీక్ష ర‌ద్దుపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ స్పందించారు. […]

The post నీట్ ప‌రీక్ష ర‌ద్దు..ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు appeared first on Navatelangana.