
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ ఎగ్జిట్-16 వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు పట్టారు. మృతదేహాలను అతి కష్ణం మీద మృతదేహల బయటకు వెలికి తీశారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది.











