కవికి కాలానికి వద్ధాప్యముండదుగాయాలను మాన్పుకుంటూ పయనించడమేఒక అప్రకటిత సందేశం!కాలానికి తెలుసుపరిణామ క్రమంలో వచ్చేహెచ్చుతగ్గులు దాని వెనుక దాగినచీకటి వెలుగులు!కవి గుండెకు తెలుసు సముద్రపు లోతులుఅట్టడుగున ఎగిసిపడేఆటుపోట్ల సుడిగుండాలు!కాలము సముద్రముఎప్పటికీ యవ్వనం కోల్పోనట్లేఅంతకుమించి కవి నిత్య యవ్వనోత్తేజుడు!మరణం వరించి వచ్చినాపద్యం నాలుగో పాదం పూర్తిగానిదేయముని మహిషపులోహ గంటలకు ప్రవేశం ఉండదు!కాలం కరిగిపోయినా, కవి ఒరిగిపోయినాచరిత్ర పుటల్లో ఆచంద్రార్కంఒదిగిపోయే జ్ఞాపకాలే!!– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261

The post ఒదిగిపోయే జ్ఞాపకాలు! appeared first on Navatelangana.