నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సీఐటీయూ ఒరిస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. కార్మిక హక్కుల కోసం దీర్ఘకాలంగా పోరాడిన ఆయన మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. బిష్ణు మొహంతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

The post ఒరిస్సా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిష్ణు మొహంతి కన్నుమూత appeared first on Navatelangana.