ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపిఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రస్తుతం టోర్నమెంట్ లీగ్ దశలో ఉంది. దీంతో ఎవరు ప్లేఆఫ్స్‌కి చేరుతారు. ఏ జట్టు కప్పుకొడుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత భారత టి-20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం టి-20 జట్టుకు సూర్యకుమయ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూర్య కెప్టెన్సీలోనే ఈ ఏడాది భారత్ టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. సూర్యను ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారట. అయితే ఇప్పుడు కెప్టెన్ రేసులో మరో పేరు వచ్చి చేరింది. అదే సంజూ శాంసన్. ప్రస్తుతం సంజు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. దీంతో సెలక్టర్లు సంజూ వైపు మొగగు చూపతారని విశ్లేషకుల అంచనా. మరి కెప్టెన్సీ సంజూకి లేదా శ్రేయస్‌కి ఇస్తారా.. లేదా సూర్యనే కొనసాగతాడా చూడాలి.