‘ది కేరళ స్టోరి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ-2’ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలు బుర్ఖాలు వేసుకొని, బొట్టు ధరించి మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జి5లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.